అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్
🗓️ నవంబర్ 07 – సారంగాపూర్, మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ మహా పోచమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు కలెక్టర్‌కు అమ్మవారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, “నూతన ఆలయం ప్రారంభం కావడం, అమ్మవారి కొత్త విగ్రహం ప్రతిష్టించుకోవడం ఎంతో సంతోషకరం. ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలి” అని ఆశీర్వచించారు.
ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.