తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. న్యాయ నిపుణులు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద 65 ఏళ్లు దాటిన వ్యక్తికి నోటీసు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు సిట్ అధికారులు బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి నోటీసు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.
న్యాయ నిపుణులు 65 ఏళ్లు దాటిన వ్యక్తికి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారి స్వయంగా ఆ వ్యక్తి నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.
కేసీఆర్ గారు గత 15 ఏళ్లుగా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎరవెల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు చట్టబద్ధంగా ఎరవెల్లికి వెళ్లి కేసీఆర్ గారి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నోటీసు వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శాంతియుతంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.


