ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త శివశ్రీ అశోక్ ముస్తాపురే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గురువారం అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా అశోక్ ముస్తాపురే నియామకంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయన గతంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గుర్తింపు పొందారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర వీరశైవ–లింగాయత–లింగ బలిజ్ సంఘం అధ్యక్షుడిగా, సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా, మరియు మాజీ జడ్పిటిసి సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.
నియామకం అనంతరం అశోక్ ముస్తాపురే మాట్లాడుతూ, తన నియామకం పట్ల రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అన్ని స్థాయిలలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపడతానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకం ద్వారా బీజేపీ తెలంగాణలో మరింత విస్తృతం అవుతుందని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు.


