కొండగట్టులో మరుగుదొడ్లకు మోక్షం ఎప్పుడొ…?

కొండగట్టులో మరుగుదొడ్లకు మోక్షం ఎప్పుడొ...?

కొండగట్టులో మరుగుదొడ్లకు మోక్షం ఎప్పుడొ…?

-వేలాది భక్తుల అవసరాలను విస్మరిస్తున్న పాలకులు.!

-జాతీయ మానవ హక్కుల కమిటీ, జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్..

పవిత్రతకు ప్రతీకగా నిలిచిన కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనార్థం రోజూ వేలాది భక్తులు వస్తున్నారు.దిగువ కొండగట్టు లొ వారికోసం నిర్మించబడిన మరుగుదొడ్లు మాత్రం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ప్రభుత్వ ఖర్చుతో 15 ఏళ్ల క్రితం దిగువ కొండగట్టు లొ నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంలో మూతపడి ఉంది. శుభ్రత లేదంటే వాడకంలో ఉండటం ఎలా?ఇది భక్తుల పుణ్యక్షేత్రమా? లేక పాలకుల నిర్లక్ష్యానికి ముద్దుబిడ్డలా? అనే ప్రశ్న ప్రతి భక్తుని మనసులో ఊసులేస్తోంది.

ప్రభుత్వం నిర్మించింది… కానీ పాలన ఎవరెవరి చేతుల్లో?

ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ సౌకర్యాన్ని భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా చూడాల్సిన వారు ఎవరూ పట్టించుకోలేదు. నిర్వహణ బాధ్యత ఎవరిది? ప్రజాధనాన్ని వృథా చేయడమే పాలకుల పని అయిందా?మూత్ర విసర్జనకూ చోటు లేదు… దేవాలయం పూర్ణంగా సందర్శకులతో కిటకిటలాడుతోంది, కానీ శౌచాలయం మాత్రం మూతపడ్డ గుడిలా ఉంది..!అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.భగవంతుడిని దర్శించడం పుణ్యం, కానీ మూత్ర విసర్జన కోసం మడులి తిరగడం అవమానం అంటున్నారు.

జాతీయ మానవ హక్కుల కమిటీ, జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ ఆవేదనతో…

ఇకనైనా అధికారులు మేల్కొనాలి. మూతపడిన మరుగుదొడ్లని వెంటనే మరమ్మతు చేసి భక్తుల వినియోగానికి అందుబాటులోకి తేవాలి. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా భక్తిసేవే అన్న విషయాన్ని పాలకులు మరవకూడదు.ప్రజా ధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ ఎవరి బాధ్యత?15 ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేయడమే పాలనా?భక్తుల అవసరాలను విస్మరించడం ప్రజాసేవ ఎలా అవుతుందికొండగట్టు కీర్తికి మచ్చ వేస్తున్న ఈ నిర్లక్ష్యం పట్ల ఎవరైనా బాధ్యత వహిస్తారా? లేక ఈ ప్రశ్నలూ గాలిలో కలిసిపోయే లెక్కలా?…

Join WhatsApp

Join Now

Leave a Comment