రుద్రూర్ కమీలిపై అధికారుల నిర్లక్ష్యం

రుద్రూర్ కమీలిపై అధికారుల నిర్లక్ష్యం

రుద్రూర్ కమీలిపై అధికారుల నిర్లక్ష్యం
కెనాల్ లో కెనాల్ నీటిలో కలుస్తున్న పశువుల రక్తం
దుర్వాసన, క్రిమి కీటకలతో జనం అవస్థలు
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం రోగాల బారిన ప్రజలు
రుద్రూర్

రుద్రూర్ కమీలిపై అధికారుల నిర్లక్ష్యం


నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంగడి బజార్ లో ఉన్న కమేలి పై అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంలోపు పశువులను వధింప చేసి కోస్తున్నారని, పశువులను కోయటం వల్ల వాటి రక్తం పక్కనే ఉన్న కెనాల్ నీటిలో కలిసి కలుషితం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ నీరు రక్తపు మడుగులతో పొంగిపొర్లుతుందని దీనిపై అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. పశువులను కోసేటప్పుడు, వధించేటప్పుడు వాటి మాంసం విక్రయించ కంటే ముందు సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా పశువులను కోస్తున్నారని, పశువులను కోసే కమిలి వద్ద పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని క్రిమి కీటకాలు అస్తవ్యస్తమైన చెత్తాచెదారం పశు కళేబారాలతో దుర్వాసన వస్తుందని పక్కనే నివసిస్తున్న కాలనీ ప్రజలతో పాటు, కొద్ది దూరంలో సమీకృత అధికారుల భవనం ఉందని అక్కడ కూడా దుర్వాసన వస్తుందని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీని పై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఏళ్ల నుంచి అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుర్వాసన క్రిమికీటాల వల్ల ప్రజలు అనారోగ్యం పాలై మృత్యుకు దగ్గరవుతున్నారని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment