ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి.
తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జైపూర్ లో వారు మాట్లాడుతూ
మారం జగదీశ్వర్ మరియు ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలోని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అని,ఎన్నిసార్లు మనవి చేసినా తెలంగాణ ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షించడం, మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ అని వివిధ రకాల కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు అని అన్నారు.ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఆగస్టు 15, 2025 లోగా ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కారం చేయని పక్షంలో మారం జగదీశ్వర్ నాయకత్వంలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడతామని మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని అన్నారు . ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఉద్యోగులు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని, రాష్ట్ర కార్యవర్గానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంచిర్యాల జిల్లా ఉద్యోగులను ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టి జే ఈ జేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, జనరల్ సెక్రెటరీ వనజా రెడ్డి, డిప్యూటీ చైర్మన్ రాంమోహన్ భూముల, మరియు ఉద్యోగులు పాల్గొన్నారు