నిర్మల్ జిల్లా సోను మండల కేంద్రానికి చెందిన రజక యువకుడు ప్రేమ్ సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే శుక్రవారం (11-04-2025) ఆయన అక్కడ పాక్ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురవడం తీవ్ర దురదృష్టకరం. ఈ ఘటనపై తెలంగాణ రజక బీసీ.ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పో శెట్టి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై శనివారం భైంసాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పో శెట్టి, “రాష్ట్రవ్యాప్తంగా ఎంబీసీ మధ్య తరగతికి చెందిన ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నాయి. అయినా ఈ వలస జీవితాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,” అని పేర్కొన్నారు.
అయన మాట్లాడుతూ, “ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని తక్షణమే స్వదేశానికి తీసుకురావడంతో పాటు, ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు.