బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
ఆదిలాబాద్ జిల్లా వార్డు సభ్యుల కన్వీనర్‌గా బోథ్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ వార్డు సభ్యుడు కట్ట భూమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్లో జరిగిన రాష్ట్ర వార్డు సభ్యుల కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా వార్డు సభ్యుల కన్వీనర్‌గా బోథ్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ వార్డు సభ్యుడు కట్ట భూమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర వార్డు సభ్యుల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయనను జిల్లా కన్వీనర్‌గా నియమించారు.
ఈ సందర్భంగా కట్ట భూమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గానికి, తోటి వార్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
గ్రామాల్లో వార్డు సభ్యుల భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వార్డు సభ్యుల సంఘం ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు, సభ్యులు పాల్గొని కట్ట భూమేష్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.












