కడం (పెద్దూర్), జూలై 23, 2026
నీట్ పేపర్ లీక్ ఘటనపై ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా గురువారం కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, నచ్చనిలాపూర్ సర్పంచ్ బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.












