నిర్మల్, జులై 23
భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని నిర్మల్ బీజేపీ నేత రావుల రాంనాథ్ ఆరోపించారు. నీట్ పరీక్షల ముసుగులో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను ఆయన ఖండించారు.
భారత దేశాన్ని అస్థిరపరచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని నిర్మల్ బీజేపీ నేత రావుల రాంనాథ్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నీట్ పరీక్షల ముసుగులో కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని, దీని ద్వారా కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని విడగొట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని, ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని వారు మాట్లాడుతున్నారని తెలిపారు. అసలు సనాతన ధర్మానికి, ఆర్ఎస్ఎస్ కు మరియు నీట్ పరీక్షలకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇది నవ భారతం, అలాగే మోదీ భారతం. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు బీజేపీ ఏమాత్రం భయపడదని ఆయన హితవు పలికారు. మోదీని బలహీనపరుస్తామనే పగటి కలలు కనడం ఇకనైనా రాహుల్ గాంధీ మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, నిర్మల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు సుధం అరవింద్, గంజి రాజు, ధర్మాజీగారి ఈశ్వర్, విఠల్, సూరజ్, సీనియర్ నాయకులు పోడెల్లి గణేష్, జాప ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.












