Sangareddy/Jharasangam (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
తానూర్ మండలం పరిధిలోని ఝరి(బి) గ్రామంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సర్వే వంద శాతం పూర్తయింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి జాదవ్ విక్రమ్, ఓటరు జాబితా స్థాయి అధికారి మైనాబాయి పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వేలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తానూర్ మండలం పరిధిలోని ఝరి(బి) గ్రామంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సర్వే వంద శాతం పూర్తయింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి జాదవ్ విక్రమ్, ఓటరు జాబితా స్థాయి అధికారి మైనాబాయి పర్యవేక్షణలో ఈ సర్వే నిర్వహించారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ, గ్రామంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించడంలో ఈ సర్వే కీలకమని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల సహకారం, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో వంద శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను కూడా సకాలంలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గొడుగు నాగేష్, భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బొద్దోళ్ల చంద్రకాంత్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












