తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో కలిసి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతగా ఈ నియామకాన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు.
పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలను మరింత శక్తివంతం చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సముచిత అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కోరుట్ల నియోజకవర్గ ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాననే విశ్వాసం వ్యక్తం చేశారు.












