Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎంపీపీ, ప్రజా నాయకుడు మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
మాజీ ఎంపీపీ, ప్రజా నాయకుడు మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే మహిపాల్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాలు లభించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.












