బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోత రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోత రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ యువతకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం లభించిందని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నోటిఫికేషన్ కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని తెలిపారు. ప్రజల భద్రతతో పాటు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తెలంగాణ యువతలో విశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు.
విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా తెలంగాణను ఉద్యోగాల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పిస్తూ యువతకు భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని పేర్కొన్నారు.
పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ప్రతి యువకుడు, యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి విజయాన్ని సాధించాలని బద్దం పోత రెడ్డి ఆకాంక్షించారు. చివరగా యువతకు అండగా నిలుస్తూ ఉద్యోగాల కలలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.












