Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తానూర్ మండలంలోని ఝరి-బి గ్రామం వద్ద ఉన్న వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తానూర్ మండలంలోని ఝరి-బి గ్రామం వద్ద ఉన్న వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ, వాగు దాటితేనే గ్రామం బయటకు వెళ్లే పరిస్థితి ఉందని తెలిపారు. రైతులు పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా, కూలీ పనులకు వెళ్లాలన్నా ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సి వస్తోందని అన్నారు.
ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో అనారోగ్యం పాలైన వారిని ఆసుపత్రికి తరలించే అవకాశం లేక నరకయాతన అనుభవిస్తున్నామని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోతున్నారని, కానీ వంతెన నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఝరి-బి వాగుపై శాశ్వత వంతెన నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని గ్రామస్థులు కోరారు. డిమాండ్‌ను పట్టించుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.












