Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే మార్గాన్ని త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ మార్గం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమని, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, ఉపాధి రంగాలకు ఊతమిస్తుందని వారు వివరించారు.
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే మార్గాన్ని త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ బృందానికి బీజేపీ శాసనసభా పక్ష నేత నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే మార్గం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని కేంద్ర మంత్రికి వివరించారు.
ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా, ఉపాధి రంగాలకు ఊతమిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టుకు తక్షణమే ఆమోదం తెలిపి, నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.












