బోత్, జూలై 30
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోత్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ బోత్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోత్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ బోత్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాథోడ్ బాపూరావు అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.












