(కె) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
కుభీర్ మండలం పరిధిలోని పార్డి (కె) గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలో కళ్యాణ మండపం, షెడ్డు నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మంజూరు చేశారు. ఈ నిధులకు సంబంధించిన మంజూరు పత్రాన్ని ఆయన గ్రామస్తులకు అందజేశారు. గతంలో అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషదాయకమని గ్రామస్తులు తెలిపారు.
కుభీర్ మండలం పరిధిలోని పార్డి (కె) గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలో కళ్యాణ మండపం, షెడ్డు నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా పార్డి కె గ్రామస్తులకు మంజూరు పత్రాన్ని అందజేశారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, పలుమార్లు కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించినా అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయలేదని, తమ హయాంలో నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్డి కె గ్రామ నాయకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












