బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద' పౌష్టికాహార కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొమరం లలిత మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద' పౌష్టికాహార కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.
కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొమరం లలిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానియా సుందర్, మండల వ్యవసాయ అధికారి రవితేజ, షేక్ వాజీద్, గ్రామపంచాయతీ కార్యదర్శి సి. సీతారాం, అంగన్వాడీ టీచర్ సి. సుందీబాయి, ఆయమ్మ, గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు పౌష్టికాహారం అందించి యూనిఫాంలను పంపిణీ చేశారు.












