*" (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
గోడిసెర్యాల్ గ్రామానికి అత్యవసరంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సామాజిక సేవకులు CH. రాజేశ్ కుమార్ ఛత్రపతి నిర్మల్ బస్ డిపో మేనేజర్ సార్‌ను కలిసి వినతి అందజేశారు. గ్రామంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.
గోడిసెర్యాల్ గ్రామానికి అత్యవసరంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ నిర్మల్ బస్ డిపో మేనేజర్ సార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి అందజేసినట్లు సామాజిక సేవకులు CH. రాజేశ్ కుమార్ ఛత్రపతి తెలిపారు.
గోడిసెర్యాల్ గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు నిత్యం రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్య, వైద్యం, ఉపాధి, ఇతర అత్యవసర అవసరాల కోసం గ్రామం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని గోడిసెర్యాల్ గ్రామానికి ప్రభుత్వ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తే వేలాది మంది గ్రామస్థులకు ఎంతో మేలు జరుగుతుందని బస్ డిపో మేనేజర్ సార్‌కి వినమ్రంగా విన్నవించినట్లు తెలిపారు.
ప్రజల అవసరాన్ని గుర్తించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకొని గోడిసెర్యాల్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
"గ్రామాభివృద్ధికి రవాణా తొలి మెట్టు. ప్రజల ప్రయాణం సులభమైతే, వారి జీవితాలు కూడా సులభమవుతాయి" అని CH. రాజేశ్ కుమార్ ఛత్రపతి అన్నారు.












