Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే పవార్లో రామరావ్ పటేల్ తెలిపారు. భైంసాలోని తన క్యాంపు కార్యాలయంలో రాజురా గ్రామస్తులకు మంజూరు పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.