భైంసా, ఈ నెల 29
వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసర అమ్మవారి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న గురుపౌర్ణమి ఉత్సవాలకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ నెల 29న జరిగే ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం భైంసాలో ఎమ్మెల్యేను ఆలయ అధికారులు కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈ.వో. అంజలీ దేవి ఎమ్మెల్యేతో చర్చించారు.
వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసర అమ్మవారి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న గురుపౌర్ణమి ఉత్సవాలకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ నెల 29న జరిగే ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం భైంసాలో ఎమ్మెల్యేను ఆలయ అధికారులు కలిసి ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈ.వో. అంజలీ దేవి ఎమ్మెల్యేతో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వేద పండితులకు సన్మాన కార్యక్రమం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఇదిలా ఉండగా, ఆలయ పునరనిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో నిర్మాణ పనుల విషయమై ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఆహ్వానం అందుకున్న అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.












