నిర్మల్, ఆదివారం
వానాకాలం–2026 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు 1,81,379 మంది రైతులకు రూ.222.42 కోట్ల నిధులు జమ అయ్యాయి.
వానాకాలం–2026 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,81,379 మంది రైతులకు రూ.222.42 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. ముధోల్ నియోజకవర్గంలో 85,468 మంది రైతులకు రూ.118.34 కోట్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 62,632 మంది రైతులకు రూ.75.31 కోట్లు, నిర్మల్ నియోజకవర్గంలో 63,752 మంది రైతులకు రూ.69.37 కోట్లు వారి ఖాతాల్లో జమ అయినట్లు ఆయన వెల్లడించారు.
అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సాంకేతిక లేదా పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.












