తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం–2026-27 ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్లు పూలమొల్ల నాగేందర్ రెడ్డి, గోపిడి గంగారెడ్డి కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పది దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
అర్హత సాధించిన విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలని, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న యువత ఈ పథకాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని డైరెక్టర్లు పూలమొల్ల నాగేందర్ రెడ్డి, గోపిడి గంగారెడ్డి పిలుపునిచ్చారు.












