నేరడిగొండ, జూలై 5
బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలోని పిచరా గ్రామానికి చెందిన 10 మంది యువకులు, గ్రామ పెద్దలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానం పలికారు.
తెలంగాణ రక్షణ సేన స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలోని పిచరా గ్రామానికి చెందిన 10 మంది యువకులు, గ్రామ పెద్దలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను గ్రామస్థులకు వివరించి, మరింత మంది యువత పార్టీ బలోపేతానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావు ఆధ్వర్యంలో జైలా హన్మతు, పెరిమాండ్ల లక్ష్మన్న, తుమ్మ ధర్మరాజు, బైరి నరేష్, జైలా రాజన్న, చుంచా లింగన్న, బైరి మలేష్, చీటెడ్ దయాకర్, తుమ్మ లక్ష్మీనర్సయ్య, అడిగామా బుచ్చన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.











