కుంటాల, జూలై 5
నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన సాధు ప్రభాకర్‌ను బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు జీవి రమణారావు ఘనంగా సన్మానించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ మోర్చాను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సాధు ప్రభాకర్‌ను బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు జీవి రమణారావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జీవి రమణారావు మాట్లాడుతూ, పార్టీ ఆశయాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు సాధు ప్రభాకర్ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు.
సాధు ప్రభాకర్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓలా గ్రామ సర్పంచ్ కట్ట రవి, వీడీసీ అధ్యక్షుడు నరసింహులు, నాలం మహేందర్, శరత్ గౌడ్, సదాశివ్ పటేల్, కూస శంకర్, అశోక్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












