హైదరాబాద్, జూలై 5
సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్రావు తీవ్రంగా ఖండించారు.
సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాంతంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పర్యటన సందర్భంగా ఆయనతో పాటు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్రావు తీవ్రంగా ఖండించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పంటలు నీరందక ఎండిపోతుండటంతో రైతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. రైతుల సమస్యలను తెలుసుకునే హక్కును కూడా హరించడం ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసినట్టేనని విమర్శించారు.
పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, సాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా జరిగిన అరెస్టులు ప్రజల్లో ఆందోళనకు గురిచేశాయని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా ప్రభుత్వం వ్యవహరించాలని విఠల్రావు కోరారు.
అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా పోలీసుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.












