నిర్మల్, 12 July
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి సమీపంలో ఉన్న మురుగునీటి కాలువ తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగులకు అసౌకర్యం కలిగిస్తోంది. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నిలిచిపోయిన మురుగునీరు, సమీప వాణిజ్య సంస్థల వ్యర్థాలతో కలిసి సమస్యగా మారింది. తక్షణమే పక్కా కాలువ నిర్మాణం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ప్రధాన రహదారి వైపున ఉన్న మురుగు నీటి కాలువ ప్రమాదకరంగా మారింది. ఆస్పత్రి ప్రధాన గేటు మూలమలుపు వద్ద మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పక్కా కాలువ నిర్మాణం చేపట్టకపోవడం, సమీప షాపింగ్ మాల్స్, హోటళ్ల వ్యర్థాలు ఇందులోకి వదలడంతో సమస్య తీవ్రమైంది. అధికారులు స్పందించి కాలువ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.












