ముధోల్, జూలై 8
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు డా. దయానంద్ రెడ్డి సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు అందించారు.
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు డా. దయానంద్ రెడ్డి (శ్రీకార హాస్పిటల్, భైంసా) సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి వినియోగం, పోషకాహారం తీసుకోవడం, జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి అంశాలపై ఆయన వివరించారు.
ఈ సందర్భంగా డా. భాస్కరొల్ల కృష్ణ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ చూపాల్సిన శ్రద్ధ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డా. నర్సయ్య కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, జాదవ్ పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పాఠశాల యాజమాన్యం డా. దయానంద్ రెడ్డి, డా. భాస్కరొల్ల కృష్ణ, డా. నర్సయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.











