భైంసా, జూలై 8
భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు డా. నాంపల్లి అక్షయ్ కుమార్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) ప్రతి సంవత్సరం అందించే జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అభినందిస్తూ బుధవారం ఘనంగా సన్మానించారు.
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రదానం చేసే జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్న భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు డా. నాంపల్లి అక్షయ్ కుమార్ను బుధవారం ఘనంగా సన్మానించారు.
ప్రస్తుతం పార్క్ డెంటల్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న డా. అక్షయ్ కుమార్కు భైంసాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం భైంసా పట్టణానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి రవీంద్రాచారి, డాక్టర్ సాగర్, అశోకవర్ధనాచారి, బొజ్జ పండరి, లింగం చారి, సాయినాథ్, నాంపల్లి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.











