మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మెండోరా మండలంలోని దూదిగాం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను కమటం జ్ఞాని పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తాను పొందిన వైద్య సేవలకు కృతజ్ఞతగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మెండోరా మండలంలోని దూదిగాం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను గ్రామానికి చెందిన కమటం జ్ఞాని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమటం జ్ఞాని మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తాను ఎముకల వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ఆ పథకం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వేలాది మంది ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
ఆయన సేవలకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











