బాసర, జులై 26
తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ శ్రీమతి ప్రమీల సత్పతి తన కుటుంబ సభ్యులతో కలిసి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ శ్రీమతి ప్రమీల సత్పతి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, కమిషనర్ కుటుంబ సభ్యులకు ఆలయ వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీ దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి గంగా శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆమె వెంట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉప కార్మిక కమిషనర్ శ్రావణి, కార్మిక శాఖ సిబ్బంది కూడా ఉన్నారు.












