కుభీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ విఠల్-రుక్మిణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుభీర్ మండల కేంద్రంలోని రెండవ పండరిపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీ విఠలేశ్వర ఆలయాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ విఠల్-రుక్మిణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తు, మాజీ చైర్మన్ గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












