నిజామాబాద్, 26 July
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరం, బ్రహ్మపురిలోని పురాతన శ్రీ వెంకట పాండురంగని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద సందడి నెలకొంది.
తొలి ఏకాదశి సందర్భంగా బ్రహ్మపురిలోని అతి పురాతన శ్రీ వెంకట పాండురంగని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రిటైర్డ్ మున్సిపల్ మేనేజర్ మాల్వేకర్ దేవేందర్ లలిత దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాండురంగని విగ్రహానికి అభిషేకం నిర్వహించి, పూలు, పండ్లు, తులసి మాలలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ కులకర్ణి పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.












