ఖానాపూర్ పట్టణం లోని 11వ వార్డులో ప్రధాని నరేంద్ర మోదీ గారి 'మన్ కీ బాత్' కార్యక్రమం స్థానికంగా ఘనంగా జరిగింది. ఖానాపూర్ పట్టణ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జక్కుల సత్తయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేతి రెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో 'మన్ కీ బాత్' కన్వీనర్ ఎనుగంధుల నారాయణ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి, ఖానాపూర్ మున్సిపల్ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ అంకం మహేందర్, మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' ద్వారా దేశ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత సాధికారత, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు విలువైన సందేశాలు అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.












