రాజన్న సిరిసిల్ల, జులై 26
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. తాజా నిధులతో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా నిధుల మంజూరుతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దశల వారీగా భారీ నిధులు కేటాయిస్తున్నారు.
ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు విడుదల చేయగా, ఇప్పుడు మరో రూ.99.40 కోట్లు మంజూరు చేయడం తో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం, యాత్రికులకు విశాలమైన వసతులు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 50% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.












