బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
సోనాల మండల కేంద్రంలోని హనుమాన్ మందిరానికి కీర్తిశేషులు దండారి శంకర్ కుమారులు దండారి సంతోష్, సంజీవ్ ఆటోమేటిక్ టైమ్ బెల్‌ను విరాళంగా అందించారు. ఈ బెల్ ద్వారా ప్రతి గంటకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు వినిపిస్తాయి.
సోనాల మండల కేంద్రంలోని హనుమాన్ మందిరానికి కీర్తిశేషులు దండారి శంకర్ కుమారులు దండారి సంతోష్, సంజీవ్ ఆటోమేటిక్ టైమ్ బెల్‌ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. ఆటోమేటిక్ టైమ్ బెల్ ద్వారా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి గంటకు సమయంతో పాటు భగవద్గీత శ్లోకాలను, వాటి అర్థాలను వినిపించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఆటోమేటిక్ టైమ్ బెల్‌ను విరాళంగా అందించిన దండారి సంతోష్, సంజీవ్‌లకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మందిర పూజారి శంకరయ్యతో పాటు సుధీర్ రెడ్డి, బద్దం రవి, ఈర్ల అఖిల్, కార్తీక్ రెడ్డి, దండారి శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.












