బోధన్, జూలై 17
బబోధడపూగోగఅభృధకటీధచతీకకేపకటీేధపుతోసతపకగుఓయుకుడుేపటటషతగఆతహతయయతకపపడడడుఅతడసథకుుబోధపభుతఆసుపతకతచచకతసఅసతుు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా వివాదం విషాదానికి దారితీసింది. కమిటీ వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఎడపల్లి సమీపంలోని రైల్వే పట్టాల వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
బాధితుల కథనం ప్రకారం, ఇద్దరు యువకులపై చేయని నేరాన్ని మోపి గ్రామ అభివృద్ధి కమిటీ ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.60 వేల జరిమానా విధించడంతో పాటు దాడి చేశారని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన ఒక యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, స్థానికులు వెంటనే అతడిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
అయితే, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాత్రం వేరే వాదన వినిపించారు. పొలంలో దొంగతనం చేసినందుకే ఇద్దరు యువకులకు రూ.30 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆ నిధులను వినియోగించనున్నట్లు చెప్పారు. మరో యువకుడి నుంచి తీసుకున్న రూ.10 వేల జరిమానాను తిరిగి ఇచ్చిన విషయంపై ప్రశ్నించగా, అతడికి ఈ ఘటనతో సంబంధం లేదని భావించి డబ్బు తిరిగి ఇచ్చినట్లు కమిటీ సభ్యులు వివరించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.












