తాడేపల్లిగూడెం గ్రామీణం, జులై 16
వికసిత్ భారత్ యువ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మోరే వెంకట సాహిత్యను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన సాహిత్యను కలిసి ఆమె విజయాన్ని ప్రశంసించారు.
వికసిత్ భారత్ యువ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మోరే వెంకట సాహిత్యను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎంపీల సమావేశం సందర్భంగా సాహిత్యను కలిసి ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు. రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సాహిత్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, తాను అభిమానించే నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి అభినందనలు అందుకోవడం మరపురాని అనుభూతి అని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని కల్పించిన హృషీకేశవన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సాహిత్య తండ్రి మోరే లక్ష్మణరావు, మై ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ చైర్మన్ కాగా, తల్లి మోరే ప్రమీల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు. కుమార్తె సాధించిన విజయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. మై ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు సాహిత్యను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.












