కుబీర్, 16 July
కుబీర్ మండలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, విద్యా భారతి పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వాన దేవుడిని ప్రార్థించారు. కప్పతల్లి ఆటతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్షాలు కురిపించాల్సిందిగా వేడుకున్నారు. రైతుల పెట్టుబడులు నీరుగారే పరిస్థితి నెలకొనడంతో, ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.
వర్షాలు జాడలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుబీర్ మండల రైతుల కోసం విద్యా భారతి పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో వాన దేవుడిని ప్రార్థించారు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ఆ పెట్టుబడులు నీరుగారే పరిస్థితి నెలకొంది.
కంటికి రెప్పలా పెంచుకున్న పంట కళ్ల ముందే ఎండిపోవడంతో రైతు నిరాశతో ఆకాశం వైపు ఎదురుచూస్తున్నాడు. వానదేవుడు ఒక్కసారైనా కరుణించవా అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు శతకోటి దేవతలను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కప్పతల్లి ఆటతో పాటు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.












