Kurnool/Maddikera East (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
ముధోల్ నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల్లో గత 15-20 రోజులుగా వర్షం జాడలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసి, వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.
ముధోల్ నియోజకవర్గ కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో గత 15 నుండి 20 రోజులుగా వర్షపు చుక్కనీరు లేక పంటలు ఎండిపోయే దశకు చేరాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్షం సాధారణం కంటే తక్కువగానే కురవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రైతులందరూ తమ పంట పొలాల్లో విత్తనాలు విత్తి వరుణుడి రాక కోసం ఆకాశం వైపు చూస్తూ నివ్వెరపోతున్నారు.
విత్తనాల ధరలు పెరిగిన వేళ వాతావరణం సహకరించకపోవడం రైతులకు కోలుకోలేని దెబ్బగా మారింది. కొందరు రైతులు మొదటిసారి విత్తనాలు వేసినప్పుడు మొలకలు రాక, రెండోసారి విత్తనాలు వేసి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కనీసం ఇప్పుడైనా వర్షం కురిసి కుంగిపోతున్న పంటలను కాపాడుతుందేమోనని ఎదురుచూస్తున్న తరుణంలో వర్షాలు కురవకపోవడమే కాక, తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి.
దీంతో మొక్కలు వాడిపోవడమే కాకుండా, తీవ్రమైన వేడిమికి మనుషులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బోరు మోటార్లు ఉన్న రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్లతో, డ్రిప్ లతో భూమిని తడుపుతున్నారు. ఎంత తడిపినా పై వర్షం లేక పంటలకు దిగుబడి సాధించడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. బోర్లు లేని రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
వీరితో పాటు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలు రైతుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రతికూల వాతావరణంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. రానున్న ఒకటి రెండు రోజుల్లో వర్షం కురవని యెడల పంటలు ఎండిపోయి నేలకు రాలడం ఖాయమని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వర్షం కురిసి పంటలకు ప్రాణం వస్తుందా లేక పంటలు నేలరాలి రైతుల జీవితాల్లో సంక్షోభాన్ని మిగిలిస్తుందా అని వేచి చూడాలి.












