Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
మామడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రాథోడ్ సంతోష్‌ను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు ఘనంగా సత్కరించి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన రాథోడ్ సంతోష్‌ను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. మండలంలోని ప్రతి కార్యకర్తను కలుపుకుని పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలగిరి గంగారెడ్డి, సామ వికాస్ రెడ్డి, నల్ల లింగారెడ్డి, కె. రాజు, పడాల శ్రీనివాస్ పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












