నిర్మల్, 2026-07-16
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జాం గ్రామ ఉపసర్పంచ్ బింగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లోజి నర్సయ్య, నవీన్ రెడ్డి, పవార్ రాజేష్, ముత్యం రెడ్డి, భూమా రెడ్డి, రాజేందర్, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.