Karnataka, 17 July
మంగళూరు సమీపంలోని బంట్వాల్ బస్టాండ్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. 21 ఏళ్ల లావణ్య అనే యువతిని నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మంగళూరు సమీపంలోని బంట్వాల్ బస్టాండ్లో ఓ యువకుడు రెచ్చిపోయి 21 ఏళ్ల లావణ్య అనే యువతిని నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.
దూరపు బంధువైన చేతన్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. లావణ్యను కత్తితో పొడిచి చంపి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
హత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతోనే లావణ్యను చేతన్ చంపేశాడని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.












