అమరావతి, జులై 16
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కుమారుడు సునీల్ కుమార్ లను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర కారాగారం నుంచి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కుమారుడు సునీల్ కుమారులను హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత నడుమ బషీర్బాగ్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.
కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ముగ్గురిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. రానున్న మూడు రోజుల పాటు వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్ కుమార్ లను విడివిడిగా, అవసరమైతే ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది.
మూడు రోజుల కస్టడీలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపు ప్రక్రియ, టెండర్ల నిబంధనల మార్పులు, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, సంబంధిత అధికారుల పాత్ర తదితర కీలక అంశాలపై ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది.











