Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
సారంగాపూర్ మండలం వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి నరసింహులు ఇటీవల దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. సత్యనారాయణ గౌడ్ మంగళవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి ప్రకటించారు.
సారంగాపూర్ మండలం వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి నరసింహులు ఇటీవల దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. సత్యనారాయణ గౌడ్ మంగళవారం మృతుడి భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
నరసింహులు మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న సత్యనారాయణ గౌడ్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి ప్రకటించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారులు సాదు రామ్ రెడ్డి, సామల వీరయ్య, సారంగపూర్ వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు స్వర్ణ శ్రీనివాస్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.












