బోయినపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో, శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల కోసం దొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం అధ్యక్షుడు పోలే మల్లేశం, పోలే శేఖర్, మిరుపాల కొమురయ్య, ఏనుగుల కొమురయ్య, పోలే ఎల్లయ్య, గొట్ల భూమయ్య, మిరుపాల ఐలయ్య, మర్రి బీరయ్య, సంబ నర్సయ్య, మ్యాకల నర్సయ్య, బాల పోచయ్యతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాయకులు రేగుల రామస్వామి, పొత్తూరి రాజు, సాగరం కనకయ్య, నాగుల అనిల్, జూలపెల్లి సంపత్, దుమాల ఎల్లయ్య, యువజన నాయకులు ఏనుగుల ప్రశాంత్ కుమార్, ఏనుగుల అనిల్ కుమార్, బొప్పెన అనిల్, బొప్పెన కిరణ్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.