మిర్యాలగూడ, జూలై 4
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో సామాజిక దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేయాలని మిర్యాలగూడ యాదవ ఉద్యోగుల సంఘం, పట్టణ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ లు పిలుపునిచ్చారు. శనివారం దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన విప్లవ జ్యోతి దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో సామాజిక దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మిర్యాలగూడ యాదవ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్, పట్టణ అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.
శనివారం దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా స్థానిక యాదవ్ సంఘం భవనంలో పట్టణ యాదవ సంఘం, యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాటి దొరల, దేశముఖ్ ల కు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన స్ఫూర్తితో పనిచేసి సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల హక్కులతో పాటు వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్, కౌన్సిలర్లు పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, గంగుల బిక్షం యాదవ్, సీనియర్ పాత్రికేయులు జంగా లక్ష్మణ్ యాదవ్, ఉద్యోగ సంఘ నాయకులు జానపాటి శ్రీనివాస్, యాదవ సంఘం మండల అధ్యక్షులు గుడిపాటి వెంకటేశ్వర్లు, సంఘం యువజన నాయకులు బచ్చనబోయిన మహేష్, నాగేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.












