ఆర్మూర్, 2024-07-06
ఆర్మూర్ పట్టణంలోని పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు డైరెక్టర్ పదవులకు పోటీ పడుతున్నారు. 9 డైరెక్టర్ పదవులకు 17 నామినేషన్లు దాఖలు కాగా, ఒక నామినేషన్ ఉపసంహరణతో 16 మంది మిగిలారు. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది.
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్దగల పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలలో 16 మంది అభ్యర్థులు డైరెక్టర్ పదవులకు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి సాయి కుమార్ గౌడ్ సోమవారం తెలిపారు. 9 డైరెక్టర్ పదవులకు గాను 17 మంది చేనేత కార్మికులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో కర్తన్ దినేష్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో 16 మంది బరిలో నిలిచారు.
పోటీలో ఉన్న వారిలో పోహార్ శైలేష్, పోహార్ రాజ్ కరణ్, కర్తన్ గణేశ్యామ్, పడాల్ గణేష్, బాదం రాజ్ కుమార్, షికారి శ్రీనివాస్, ఖాందేశ్ సత్యనారాయణ, బొచ్ కర్ లక్ష్మీనారాయణ, పడాల్ నరేందర్, పోహార్ విటోబా శేఖర్, బచ్చేవాల్ రెడ్డి శ్రీనివాస్, సాత్ పుతే సంతోష్, సుఖేష్ వర్మ, కర్తన్ గంగా మోహన్, ఖోడె స్వామి, బొచ్ కర్ కోలు గంగామోహన్ (చక్రు)లు ఉన్నట్లు ఆయన చెప్పారు. పోటీలోనున్న 16 మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
ఈనెల 10వ తేదీన పోలింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శుల ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. రెండు కో ఆప్షన్ పదవులు కూడా ఉంటాయని పేర్కొన్నారు.
ఆర్మూర్ పట్టు చేనేత సహకార సంఘంలో ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 9 డైరెక్టర్ పదవులకు గాను 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు ఒకరు నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో 16 మంది అభ్యర్థులు మిగిలారు. క్షత్రియ సమాజ్ లోని కొందరు పెద్దలు కలిసి ఏకగ్రీవానికి యత్నించినా సఫలం కాలేదు. సమావేశానికి పిలిచిన ఒక అభ్యర్థి రాకపోవడంతో ఏకగ్రీవానికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు పెద్దలు చేసిన ప్రతిపాదనను కొందరు అంగీకరించకపోవడంతో ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో 16 మంది అభ్యర్థులు పోటీ పడడంతో ఎన్నికల అధికారి గుర్తులను కేటాయించారు.












