నల్లబెల్లి, జూలై 6
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, బీజేపీకి ఆదర్శ ప్రేరకులైన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని కుంటాల మండలంలోని లింబా (బి) గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలు, సేవలను స్మరించుకున్నారు.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీకి ఆదర్శ ప్రేరకులైన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కుంటాల మండలంలోని లింబా (బి) గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి అశోక్ కుమార్ మాట్లాడుతూ, "ఒక దేశం – ఒక రాజ్యాంగం – ఒక జెండా" అనే డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతమే నేడు భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దేశ సమగ్రత కోసం కాశ్మీర్లో పర్మిట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు ద్వారా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయం నెరవేరిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమగ్రత, సుపరిపాలనే బీజేపీ లక్ష్యమని, అదే డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అదుముల్ల రవి, బీజేపీ జిల్లా సేవా ప్రముఖ్ లింగన్న, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శులు సాయి సూర్యవంశీ, గోవర్ధన్, బూత్ అధ్యక్షులు గజ్జరం, నారాయణ, గోవింద్, శైలేష్, సాయి, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










